Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cabinet Meeting Will Be Held Tomorrow

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..

Published Date :January 1, 2025 , 8:13 pm
By RAMAKRISHNA KENCHE
  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
  • దూకుడు పెంచిన ప్రభుత్వం
  • క్లీన్ఎన‌ర్జీలో భారీగా పెట్టుబ‌డులు
  • ఎనర్జీ రంగంలోనే 2 ల‌క్షల 50 వేల మందికి ఉపాధి
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ఎన‌ర్జీలో పెట్టుబ‌డులు పెట్టెందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి.. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2 ల‌క్షల 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ. 88,747 కోట్ల ఆదాయం రానుంది.. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది.

విశాఖపట్నంలోని టీసీఎస్..
మంత్రి వ‌ర్గ స‌మావేశంలో దీనికి ఆమోదం తెల‌ప‌నున్నారు. దీంతో పాటు.. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. టీసీఎస్ ప్రతిపాద‌న‌కు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగ నుంది..దీనికి కూడా క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది..

కాకినాడలోరూ. 2,000 వేల కోట్లతో..
బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా ఎండీఎఫ్/పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు వ‌చ్చింది.. దీని ఏర్పాటుకు మంత్రి వ‌ర్గం ఆమోదం తెల‌ప‌నుంది.. ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాకినాడలో 592 ఎకరాల్లోరూ. 12,000 కోట్ల పెట్టుబడితో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీని వ‌ల‌న‌ 2,600 మందికి ఉపాధి కలగనుంది దీనికి మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలోరూ. 2,000 వేల కోట్లతో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను స్థాపించనుంది దీనికి క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్ద హుల్తిలో 2 వేల కోట్ల‌తో 1,800 ఎకరాల్లో.400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కు క్యాబినెట్ పచ్చజెండా ఊపనుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో 2 లక్ష‌ల 50 వేల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది.. దీని ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది. వైఎస్సాఆర్ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 650 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి.. దీనికి మంత్రి వ‌ర్గ భేటీలో ఆమోదం తెల‌ప‌నున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap cabinet meeting
  • AP Cabinet meeting will be held tomorrow
  • AP Government
  • clean energy
  • Huge companies

తాజావార్తలు

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

  • Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions