NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. వివిధ కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్‌లో సమీక్ష జరగనుంది.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.. వూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ. ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం సభలో బిల్లు పెట్టాలా..? లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలా..? అనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చించే అవకాశం ఉండగా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి..

Read Also: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్

మరోవైపు.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ వేసే అంశంపై కేబినెట్‌లో ప్రస్తావించనున్నారు.. ఇప్పటికే టీటీడీ విషయంలో ధర్మారెడ్డి, ఐ అండ్ పీఆర్ లో అక్రమాలపై తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే.. వీటితో పాటు.. ఇతర అక్రమాలను సీఐడీకి అప్పగించే ఛాన్స్ ఉండగా.. దీనిపై చర్చించనున్నట్టుగా సమాచారం.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌.. డయేరియా నివారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చర్చ సాగనుండగా.. శాంతి భద్రతలపై మరింత దృష్టి సారించాలనే దిశగా మంత్రి వర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. మహిళలు, మైనర్ బాలికల పట్ల లైంగిక వేధింపులను అరికట్టేలా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్ట పరిచే దిశగా కేబినెట్‌లో సమాలోచనలు చేయనున్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, నివారణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ANTF.. జిల్లాల్లో కూడా ATNF టీమ్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంపై చర్చించనుంది కేబినెట్.. 180కు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం ఉంది.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చ సాగనుంది.. మరోవైపు.. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ఆయన.. వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తారుని తెలుస్తోంది.

Show comments