AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లును అఫ్రూవ్ చేసింది.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింప జేయనున్నారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు… E1 జంక్షన్ నుండి సీఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400KV DC లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
Read Also: Allari Naresh : నరేశ్ కొత్త మూవీ టీజర్ చూశారా.. వణుకు పుట్టిస్తోందిగా
ఇక, బుడమేరు డివిజన్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్… రాజధాని అమరావతి పునఃనిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించడం.. ఏపీ – తెలంగాణ మధ్య జల వివాదాలు.. మంత్రుల జిల్లా పర్యటనలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది..