ఏపీ కేబినెట్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగా ప్రచారం చేయలేకపోయాం అని ఫైర్ అయ్యారు. యూనిట్‌కు 13 పైసలు తగ్గించినా.. మనం జనాలకు చెప్పుకోలేకపోయారంటూ విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు ఇచ్చారు.
Also Read: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
మెడికల్ కళాశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు సూచనలు ఇచ్చారు. రెండు మెడికల్ కళాశాలను వీలైనంత త్వరగా పూర్తిగా చేయాలని ఆదేశించారు. అనధికార బెల్ట్ షాప్స్ నియంత్రించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ టూర్‌పై కేబినెట్‌లో చర్చ జరిగింది. జీఎస్టీ సమావేశాలు దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ జరిగినట్టు సీఎం చెప్పుకొచ్చారు. ఎస్ఐపీబీపై కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల కేటాయింపు జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయనే దానిపై దృష్టి పెట్టాలని పవన్ సూచనలు చేశారు.
