ఏపీ కేబినెట్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగా ప్రచారం చేయలేకపోయాం అని ఫైర్ అయ్యారు. యూనిట్‌కు 13 పైసలు తగ్గించినా.. మనం జనాలకు చెప్పుకోలేకపోయారంటూ విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు ఇచ్చారు.…