AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 40కి పైగా అంశాలతో రూపొందించిన అజెండాపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించిన సీఆర్డీఏ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.596 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.533 కోట్ల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రాజధాని గ్రామాల్లో రైతులకు కేటాయించిన ప్లాట్ల పరిధిలోని చిన్న రహదారుల్లో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధికి అమరావతిలోని స్టోరేజ్ ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా చేసే ప్రతిపాదనపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 42 ఎకరాలను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
తాడికొండ, కంతేరు గ్రామాల పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కోసం అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సమీకరించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తాజా పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియ వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలపై సరైన సమాచారం వెళ్లేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించే అవకాశముంది. ఉద్యోగుల సమస్యలపై కూడా అజెండా అనంతరం ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల డిమాండ్లు, పరిపాలనా అంశాలు, వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై మంత్రులతో సీఎం సమీక్షించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..