ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. అయితే.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చింది జగన్ సర్కార్. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన కేబినెట్.. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read : Shriya Saran : ఆ స్టార్ హీరో తో సినిమాను కావాలనే వదులుకున్న శ్రీయా…?
దీంతో పాటు.. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కెబినెట్ అనుమతి. రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. చిత్తూరు డైరీ ప్లాంటుకు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతి ఇచ్చిన కేబినెట్. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు కేబినెట్ ఆమోదం. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు ఆమోదం తెలిపింది కేబినెట్.
Also Read : Expensive Cities: అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ .. టాప్-5లో సింగపూర్