NTV Telugu Site icon

AP Budget 2024: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌!

Payyavula Keshav Ap Budget 2024

Payyavula Keshav Ap Budget 2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. 10 గంటల 7 నిమిషాలకు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది.

అంతకుముందు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2.94 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను రూపొందించింది. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

వివిధ రంగాల కేటాయింపుల జాబితా:
# పాఠశాల విద్య రూ.29,909కోట్లు
# ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
# మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
# మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
# పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
# ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
# పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
# గృహ నిర్మాణం రూ.4,012కోట్లు
# రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
# పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
# యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
# జలవనరులు రూ.16,705కోట్లు
# పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
# ఇంధన రంగం రూ.8,207కోట్లు
# పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు

Show comments