Site icon NTV Telugu

Thota Chandrasekhar: కవితపై ఈడీ కేసు బీజేపీ కక్ష పూరిత చర్య

Thota Chandrashekar

Thota Chandrashekar

తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కలిగిస్తోంది. ఏపీ BRS అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఏపీలో 175 నియోజవర్గాలు 25 ఎంపి స్థానాల్లో BRS అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. దర్యాప్తు సంస్థల వేధింపులకు BRS భయపడదు. కవితపై ఈడి కేసు బీజేపీ కక్ష పూరిత చర్య. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరి వదులుతుంది. ప్రభుత్వాలను కూల గొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. బిజెపికి జాతీయ స్థాయిలో BRS ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ. రాష్త్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసింది.

Read Also: Arjun Reddy: ఛీ ఛీ.. ఇలాంటి సినిమా చేసిందా.. అర్జున్‌రెడ్డిపై స్వప్న షాకింగ్ కామెంట్స్

పోలవరం, ప్రత్యెక హోదా విషయంలో మోసం చేసింది.రాజధాని విషయంలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతోంది.10 ఏళ్లు హోదా ఇస్తామన్న ప్రధాని హామీ ఏమైంది. బిజెపికి చిత్త శుద్ధి లేదు కాబట్టి ఏపి అభివృద్ధికి సహకారం అందించడం లేదు. రాజకీయ నిరుద్యోగులు మాత్రమే బిజేపీలో చేరతారు. త్వరలో ఏపీలో భారీగా చేరికలు ఉంటాయన్నారు. టిడిపి, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయి. పెట్టుబడుల పేరుతో టిడిపి మోసం చేసింది ఇప్పుడూ వైసీపీ కూడా అదే చేస్తోందని విమర్శించారు తోట చంద్రశేఖర్.

Read Also: Mohit Joshi: టెక్ మహీంద్రాలో చేరిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్

Exit mobile version