Site icon NTV Telugu

PVN Madhav: బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారుస్తా: పీవీఎన్ మాధవ్

Pvn Madhav

Pvn Madhav

బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తాను అని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాధవ్‌కు అప్పగించారు.

Also Read: YS Jagan: అలా చేస్తేనే మంచి లీడర్‌గా ఎదుగుతారు.. యువతకు వైఎస్ జగన్ దిశానిర్దేశం!

బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించిన అనంతరం పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. ‘నేను రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. పార్టీ, తను వేరు కాకుండా మా నాన్నగారు పని చేశారు. అత్యంత సాధారణంగా పని చేస్తున్న ప్రతీ కార్యకర్త పర్యటన ద్వారా కార్యక్రమాలు చేస్తారు. పదవి ఒక బాధ్యత అని సంఘంలో నేర్పించారు. బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తాను. ఆర్ఎస్ఎస్ ప్రారంభం అయ్యి 100 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరం 2025. ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తయిన సంవత్సరం 2025. 2025లో అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకోవడం నాకు ఆనందదాయకం. బాషా మధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వం కళంకాన్ని తెచ్చింది. తెలుగును శాసన భాషగా తయారు చేసేలా పని చేస్తాం. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్ళాలి. యోగాంధ్రను ముందుకు తీసుకువెళ్ళాలి’ అని మాధవ్ అన్నారు.

Exit mobile version