NTV Telugu Site icon

Somu Veerraju: సీఎం జగన్‌పై వీర్రాజు సంచలన వ్యాఖ్యలు.. మోడీ అంటే గౌరవం లేదు..!

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్‌ అయ్యారు.. ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ఇచ్చే బియ్యంపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ తన ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ జగన్ వారం వారం ఢిల్లీకి వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఫొటో, లడ్డూలు ఇచ్చి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుంటున్నాడు.. ఇక్కడ మాత్రం స్టిక్కర్లు మార్చి, రంగులు చేసుకుంటున్నాడని మండిపడ్డారు..

Read Also: Ambati Rambabu: నన్ను ఓడించేందుకు కుట్రలు.. ఉడత ఊపులకు భయపడే రకం కాదు..

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అంటే సీఎం జగన్ కు గౌరవం లేదని విమర్శించారు సోము వీర్రాజు.. జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయాడు… 25 పార్లమెంటుల్లో, 26 జిల్లాలో ఇదే సభలు ఏర్పాటు చేసి వైసీపీ చేస్తున్న అవినీతిని ప్రజలకు చెబుతాం అన్నారు.. తొమ్మిది సంవత్సరాలలో ఏపీ ఎంత అభివృద్ధి చేశామో వివరిస్తాం.. కేంద్రం ఇచ్చే డబ్బులకు సీఎం జగన్ తన స్టిక్కర్‌ వేసుకుని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఏపీలో ఎన్నో రోడ్లును కేంద్రం అభివృద్ధి చేస్తోంది.. కానీ, జగన్ ఒక్క రోడ్డు అయినా వేశాడా..? అని నిలదీశారు.. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే జగన్‌ మాత్రం ఆ విషయం చెప్పడం లేదు అని విమర్శించారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.