Site icon NTV Telugu

Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..

Purandeswari

Purandeswari

Purandeswari: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు జనసేన టీడీపీ బీజేపీ కూటమి కట్టుబడి ఉందన్నారు. మా పార్టీల ఆలోచనలు ఒకే విధంగా ఉండడంతో కూటమిగా ఏర్పడ్డామన్నారు.

Read Also: PM Modi: జగన్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు

బాబా సాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా వెల్లడించారు. అంబేద్కర్ సంబంధించిన జ్ఞాపకాలను, ఆనవాళ్లను భారతీయ జనతా పార్టీ పరిరక్షిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు విలువలు లేవని ఆమె విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతున్నామని పురంధేశ్వరి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version