Site icon NTV Telugu

Atal–Modi Suparipalana Bus Yatra: ఏపీ వ్యాప్తంగా అటల్–మోదీ సుపరిపాలన బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?

Atal Modi

Atal Modi

Atal–Modi Suparipalana Bus Yatra: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వేదికగా ఈనెల 11వ తేదీన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలన, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రయోజన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ధర్మవరం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 నుంచి 25 వరకు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర సాగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్‌స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!

రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులు ఈ బస్సుయాత్ర జరగనుంది. ఈ యాత్రలో భాగంగా వివిధ జిల్లాల్లో బహిరంగ సభలు, ప్రజాసంబంధ సమావేశాలు నిర్వహించనున్నారు బీజేపీ పార్టీ సభ్యులు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 25వ తేదీన అమరావతిలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి మాధవ్ పాల్గొననున్నారు.

Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన అవసరం లేదు.. సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం..!

Exit mobile version