నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఆర్ధిక సాయం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి అండ్ దిగుమతి, పశు వైద్యశాలలపై సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. విశాఖ రైతులకు భూ కేటాయింపు, దొనకొండలో పారిశ్రామికవాడ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై ప్రశ్నలు సందించనున్నారు. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెవెన్యు సమస్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది.
ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పంచాయతీరాజ్, నగరపాలక, పురపాలక, నగర పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల లెక్కలపై ఏకీకృత ఆడిట్ సమీక్షా నివేదికను సభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన 2025, ఏపీ మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును మంత్రి పొంగూరు నారాయణ ప్రతిపాదించనున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయముల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లును బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించనున్నారు.
ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో:
# పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా పరిమితులు
# పాఠశాలల హేతుబద్ధీకరణ
# వాహనచోదకులకు శిరస్త్రాణాలు
# నిరుద్యోగ భృతి పథకం
# విజయవాడ మెట్రో రైలు
# మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు
# అమరావతికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం
# హంద్రీ నీవా కాలువ పనులు
# ప్రభుత్వానికి సలహాదారులు
# కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ