ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలపై ఆడిట్ నివేదికను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఏపీ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ వార్షిక ఆడిట్ నివేదికలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అలానే సాధారణ బడ్జెట్‌పై చర్చ జరగనుంది.
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో:
# జిల్లాల పునర్వ్యవస్థీకరణ
# విలేజ్ హెల్త్ క్లినిక్స్
# రాష్ట్రం లోని ఫ్రీ హోల్డ్ భూములు
# పాఠశాలలకు వెళ్లి బాలికలకు హెచ్పీవీ టీకాలు
# రాష్ట్రంలో బెల్టు షాపులు
# కమలాపురం, కడప వంతెన
# ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు
# తిరుమల దర్శన టికెట్లు
# స్థానిక సంస్థల ఎన్నికలు
# దేవాదాయ భూములు, వివాదాలు