NTV Telugu Site icon

AP Assembly Sessions 2024 LIVE UPDATES: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

Ap Assembly Sessions

Ap Assembly Sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

 

The liveblog has ended.
  • 11 Nov 2024 11:49 AM (IST)

    అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు

    భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లను వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయించారు. వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.88 కోట్లు కేటాయించారు.

  • 11 Nov 2024 11:43 AM (IST)

    ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు.

    ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు కేటాయించారు. భూసార

  • 11 Nov 2024 11:35 AM (IST)

    పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.33 కోట్లు..

    వ్యవసాయ బడ్జెట్‌లో భాగంగా 'పొలం పిలుస్తోంది' కార్యక్రమానికి రూ.11.33 కోట్లను కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగంలో తెలిపారు.

  • 11 Nov 2024 11:32 AM (IST)

    విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు

    అమరావతి: మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు, సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం.. విత్తనాలు, ఎరువులు రాయితీపై అందిస్తున్నాం.. విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు. -మంత్రి అచ్చెన్నాయుడు.

  • 11 Nov 2024 11:19 AM (IST)

    రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

    అమరావతి: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.. గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదు.. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం. -మంత్రి అచ్చెన్నాయుడు.

  • 11 Nov 2024 11:13 AM (IST)

    వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

    అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు  ప్రవేశపెడుతున్నారు.

  • 11 Nov 2024 11:10 AM (IST)

    ప్రతీ జిల్లాలో సైబర్‌ పోలీస్‌ స్టేషన్ ఏర్పాటు

    అమరావతి: క్రీడలను ప్రోత్సహిస్తాం.. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు.. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు చర్యలు.. ప్రతీ జిల్లాలో సైబర్‌ పోలీస్‌ స్టేషన్ ఏర్పాటు. -మంత్రి పయ్యావుల కేశవ్

  • 11 Nov 2024 11:07 AM (IST)

    గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్‌కు శ్రీకారం

    రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి.. గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్‌కు శ్రీకారం.. 189 కిలోమీటర్ల అమరావతి-ఓఆర్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం.. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థికాభివృద్ధిని ఎక్స్‌ప్రెస్‌వే పెంచుతుంది. -మంత్రి పయ్యావుల కేశవ్

  • 11 Nov 2024 11:05 AM (IST)

    పోలవరం పూర్తిచేయడమే మొదటి ప్రాధాన్యత

    సుస్థిర పట్టణాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అమృత్‌ -2 కింద జలవనరుల శుద్ధీకరణ చేస్తు్న్నాం.. పోలవరం పూర్తిచేయడమే మా మొదటి ప్రాధాన్యత.. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. -మంత్రి పయ్యావుల కేశవ్

  • 11 Nov 2024 10:46 AM (IST)

    జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 4.19 శాతం

    మూలధన వ్యయం రూ.32,712 కోట్లు.. జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 4.19 శాతం

  • 11 Nov 2024 10:44 AM (IST)

    దీపం పథకానికి రూ.895 కోట్లు.

    అమరావతి: దీపం పథకానికి రూ.895 కోట్లు.. దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి.. వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి.. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు.. ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు.. 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు.. విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం.

  • 11 Nov 2024 10:40 AM (IST)

    బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

    *2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

    *రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.

    *ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు,

    *రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..

    *వైద్య, ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లు

    *పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు,

    *జలవనరులు రూ.16,705 కోట్లు..

    *ఉన్నత విద్య రూ.2326 కోట్లు..

    *పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..

    *పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..

    *ఇంధన రంగం రూ.8,207 కోట్లు..

    *పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..

    *బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..

    *మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..

    *ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..

    *అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..

    * గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..

    * నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

  • 11 Nov 2024 10:31 AM (IST)

    2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

    అమరావతి: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి.. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది.. రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది.. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు.. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది. -మంత్రి పయ్యావుల కేశవ్

  • 11 Nov 2024 10:27 AM (IST)

    రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది: మంత్రి పయ్యావుల కేశవ్.

    అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది.. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు.. 93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది. -మంత్రి పయ్యావుల కేశవ్.

  • 11 Nov 2024 10:24 AM (IST)

    2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

    అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రులు.. 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్.