NTV Telugu Site icon

AP Assembly Sessions 2024 LIVE UPDATES: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్

Ap

Ap

AP Assembly Sessions 2024 LIVE UPDATES: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

The liveblog has ended.
  • 23 Jul 2024 04:40 PM (IST)

    తప్పు చేస్తే నన్ను కూడా వదలొద్దు-పవన్‌

    వైసీపీ పాలనలో పోలవరం కట్టలేక పోయారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. పెట్టుబడులు రాకుండా చేశారు. ఖజానా ఖాళీ చేశారు, సహజ వనరుల దోపిడి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారని ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కానీ, జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరు అన్నారు.. తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్‌ కల్యాణ్‌..

  • 23 Jul 2024 04:05 PM (IST)

    జగన్ పై చంద్రబాబు సెటైర్లు..

    వైఎస్‌ జగన్ పై అసెంబ్లీలో సెటైర్లు వేసిన సీఎం చంద్రబాబు.. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు.. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.. కొందరు మా ఎమ్మెల్యేలు జగన్ గురించి చెబుతున్నారు. జగన్ హెలీకాప్టర్‌లో వెళ్తే.. కింద ట్రాఫిక్ ఆపేస్తారట. ఇదేంటో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు..

  • 23 Jul 2024 03:42 PM (IST)

    ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు..

    మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నా.. ఏపీ మళ్లీ గాడిలో పడుతోంది-సీఎం చంద్రబాబు

  • 23 Jul 2024 03:10 PM (IST)

    పవన్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారు..

    పవన్ కల్యాణ్‌ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారంటూ జనసేనానిపై ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం అన్నారు.

  • 23 Jul 2024 03:09 PM (IST)

    విభజన వల్ల ఏపీకి నష్టం జరిగింది..

    విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందన్న ఆయన.. బడ్జెట్‌ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలి. గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు.

  • 23 Jul 2024 02:28 PM (IST)

    గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టిన ఎమ్మెల్యే శ్రీనివాసులు

    గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆ తీర్మానాన్ని బలపరిచారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి వర్గం ఇబ్బందులు పడిందని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నారన్నారు.ఎమ్యెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. సన్ రైజ్ బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు మన రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు. 2014 -19 మధ్య ఎక్కడా ఇబ్బందులు లేకుండా చంద్రబాబు పాలన చేశారన్నారు. ఆ తరువాత వచ్చిన జగన్ అసమర్థ పాలనను జనం చూశారని..చెత్తపై పన్ను వేసిన చెత్త పాలనను జనం చూశారని తీవ్రంగా విమర్శించారు. జగన్ పాలన అనేక మంది హత్యకు కారణమైందన్న ఆమె.. ఇప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎలా వైసీపీ మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.

    ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదన 93 శాతం సీట్లు ఎన్డీఏ కూటమి సాధించడానికి కారణమైందని బీజేపీ ఎమ్యెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. అమరావతి దుస్థితికి జగన్ పాలనే కారణమని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మీదే ఉందన్నారు. ఈ బాధ్యత వీళ్లద్దరికీ ముళ్ల కిరీటం లాంటిదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్జీవోలను అనుసంధానం చేసుకొని రాష్టాన్ని అభివృద్ధిలోకి తీసుకు రావాలన్నారు.

  • 23 Jul 2024 02:23 PM (IST)

    గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చ

    గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతోంది.ధన్యవాదాల తీర్మానంపై మండలిలో డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు.

  • 23 Jul 2024 12:42 PM (IST)

    టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ

    టీటీడీ లెటర్స్‌పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలని ఎమ్మెల్సీలు లక్ష్మణ రావు, రవీంద్ర, వేంకటేశ్వర రావు కోరారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు లెటర్‌కు 6 మందికి దర్శనం అనుమతి ఇచ్చారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. వారంలో ఆరు రోజులకు లెటర్‌కు 10 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్యేలతో సమానంగా తమకు సముచిత టీటీడీ అధికారులు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఇది పెద్దల సభ అని ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అడగాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు.

    టీటీడీ లెటర్స్ విషయంలో తాను కూడా ఇబ్బంది పడినట్టు సభలో మంత్రి ఆనం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది తన లెటర్‌కు అనుమతి ఇవ్వని అనుభవం తనకు ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. టీటీడీ లెటర్లపై సభ్యుల లేవనెత్తిన అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం చెప్పారు.

  • 23 Jul 2024 10:53 AM (IST)

    గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్న

    గ్రూపు 1 పరీక్ష అక్రమాల పై గత ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పు బట్టారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. సభ్యుల సూచనల మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.

    గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని.. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఓ విద్యా సంస్థలో జరపాల్సిన మూల్యాంకనం.. హ్యాపీ రిసార్టులో జరిపారని ఆరోపణలు చేశారు. గ్రూపు 1 పోస్టుల భర్తీ విషయంలో రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీలో ఉండి అక్రమాలకు సహకరించారని ఆరోపించారు.

    ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ లో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారని చెప్పారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారన్నారు. గ్రూపు 1 అక్రమాల పై ప్రభుత్వం కూడా విచారణ కమిటి వేసిందన్నారు. ఆగస్ట్ 31 లోగా నివేదిక వస్తుందని.. నివేదిక వచ్చిన తర్వాత సభ్యుల కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

  • 23 Jul 2024 10:39 AM (IST)

    మండలిలో డిప్యూటీ సీఎం పవన్‌కు తొలి ప్రశ్న.

    ప్రశ్నోత్తరాలతో రెండో రోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం పవన్‌ను సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపుపై మండలి సభ్యుల ప్రశ్నలు అడగగా.. ఉపముఖ్యమంత్రి పవన్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని పవన్ చెప్పారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా.. గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధులను బదలాయించడంలో జాప్యం చేసిందన్నారు. వచ్చిన నిధులను పంచాయతీలకు బదలాయుంచడంలో జరిగిన జాప్యం వల్ల కేంద్రానికి రూ. 11 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగిందని.. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 2165 కోట్ల మేర పంచాయతీల నిధులను నేరుగా డిస్కంలకు చెల్లించారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వెల్లడించారు. సర్పంచులకు తెలియకుండా డిస్కంలకు చెల్లింపులు జరపడం సరైన విధానం కాదన్నారు.

  • 23 Jul 2024 10:08 AM (IST)

    మంత్రి లోకేశ్‌కు తొలి ప్రశ్న.. నాడు-నేడు పనులపై సభ్యుల ప్రశ్నలు.

    ప్రశ్నోత్తరాలతో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేష్‌కు తొలి ప్రశ్నతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాడు-నేడు పనులపై సభ్యులు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నాడు-నేడు పనుల్లోని అవకతవకలపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రావణ్ కోరారు. పనులు చేయకుండానే బిల్లులు తీసేసుకున్నారని.. నాడు-నేడులో పనులు చేపట్టి.. ఆ తర్వాత అదే స్కూళ్లను మూసేశారని ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. నాడు-నేడు పనుల పేరుతో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాళ ఆరోపణలు చేశారు.

    నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తొలి ఏడాదిలో కేజీ-పీజీ వ్యవస్థను ప్రక్షాళన చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. నాడు-నేడు పనులపై విచారణ ఏ విధంగా చేపడతారో సభలో ప్రకటించాలని స్పీకర్ అయ్యన్న కోరగా.. సభ్యులు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టి.. సభలో నివేదిక పెడతామని లోకేష్ వెల్లడించారు రకరకాల సిలబస్‌ల పేరుతో విద్యార్థులను గత ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని లోకేష్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం విద్యా వ్యవస్థను గాడిలో పెడతామని లోకేష్ పేర్కొన్నారు.

Show comments