AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు

  • రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు
  • 2024-25 గ్రాంట్స్‌ డిమాండ్స్‌పై చర్చించనున్న అసెంబ్లీ
  • డివిజినల్ రైల్వే యూసర్స్ కమిటీ ప్రతినిధిని ఎన్నుకోనున్న అసెంబ్లీ
Ap Assembly 2024 4th Day

Ap Assembly 2024 4th Day

AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎమ్మెల్యేలలో ఒకరిని ఎన్నుకోవడానికి అసెంబ్లీ ముందుకు మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి తీసుకురానున్నారు. 2024-25 గ్రాంట్స్ కోసం డిమాండ్స్‌పై చర్చ చేపట్టనున్నారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్

గ్రామీణాభివృద్ధి డిమాండ్ కింద 7949.87 కోట్ల గ్రాంటు

అటవీ,సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్

మంత్రి నారా లోకేష్

పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్

ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్

ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్

మంత్రి సత్యకుమార్ యాదవ్

వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్

మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్

మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్

ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్

లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్.ఎండి.ఫరూఖ్

మైనారిటీల సంక్షేమం కింద రూ.2808.75 కోట్ల గ్గ్రాంట్

అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ రూ.1227 కోట్లు గ్రాంట్

*ప్రభుత్వ బిల్లులు……*
రేపు అసెంబ్లీలో పలువురు మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024

మంత్రి పొంగూరు నారాయణ

ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024

మంత్రి సత్యకుమార్ యాదవ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024

ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024

ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024

మంత్రి అనగాని సత్యప్రసాద్

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024

మంత్రి అచ్చెం నాయుడు

ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024