Site icon NTV Telugu

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక నిర్ణయం.. వారికి కూడా నో ఎంట్రీ..

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఇవాళ(గురువారం) సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయనున్నారు. రేపు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంగ్ల అక్షరాల ప్రాతిపదిక వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

Read Also: Nellore: ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు మృతి

అయితే రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఏపీ శాసనసభ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని వెల్లడించారు. విజిటింగ్ పాసులు రద్దు చేయడంతో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం ఉండదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తమవారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం వారి కుటుంబసభ్యులకు ఉండదు.

Exit mobile version