AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగినున్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన సమావేశాల్లో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ వచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇక, ఆ తర్వాత శాసన సభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది టీడీపీ.. అయితే, ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఈ రోజు సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు -2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు (నెం.3) -2023లు ఈరోజు సభ ముందుకు రానున్నాయి.. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది వైఎస్ జగన్ సర్కార్. మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలపై షార్ట్ డిస్కషన్ జరగనుంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు.
Read Also: Tiger Nageswara Rao: రవితేజ నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
మరోవైపు.. ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలను ప్రశ్నోత్తరాలతో ప్రారంభించనున్నారు మండలి చైర్మన్.. ఇక, మండలి ముందుకు ఈ రోజు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రానుంది. స్కిల్ స్కాం పై రెండవ రోజు చర్చ కొనసాగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిపై స్వల్ప కాలిక చర్చలు సాగనున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.