NTV Telugu Site icon

Ap Assembly Session: 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. అంశాలివే!

Ap Assembly Session

Ap Assembly Session

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా సోమవారం లాగే హాట్ హాట్ గా సాగే అవకాశాలున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న నాలుగో రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇవాళ సభలో టేబుల్ పెగాసెస్ కమిటీ నివేదిక సభ ముందుకి రానుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది.

Read Also: Astrology : సెప్టెంబర్ 20, మంగళవారం దినఫలాలు

ఈనివేదికను హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు తెలుస్తోంది. హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేశామని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉందని రాజా తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో నాడు- నేడు పై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో వివిధ సమస్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. విష జ్వరాలు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ఎన్ఆర్‌ఈజీఎస్ లో వేతన బకాయిలు గురించి ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భూ పట్టాల పంపిణీ, లేపాక్షి నాలెడ్జ్ పార్క్, ఉచితంగా ఇళ్ళ నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు, మద్యం, మాదకద్రవ్య సంబంధిత ఆత్మహత్యలపై చర్చ జరగనుంది.

Read Also: Tues Day Hanuman Chalis Parayanam Live: ఈ రోజు హనుమాన్ చాలీసా వింటే ఎలాంటి కష్టాలు రావు..