NTV Telugu Site icon

AP Assembly & Lok Sabha Exit Poll 2024: ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌.. అధికారం ఎవరిదంటే..?

Ap

Ap

AP Assembly & Lok Sabha Exit Poll 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. గెలుపుపై ధీమాతో కొందరు నేతలు ఉంటే.. ఊగిసలాటలో మరికొందరు ఉన్నారని స్పష్టం అవుతుంది.. అయితే, మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్‌ ఇవాళ్టితో ముగియనుండడంతో.. ఆ తర్వాత వివిధ సర్వే సంస్థలు.. తమ తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి.. కొన్ని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనా వేస్తే.. ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం అంటూ మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి..

ఇక, ఆరా మస్తాన్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ విషయానికి వస్తే.. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రులు పెద్ద సంఖ్యలో ఓటమికి మూటగట్టుకుంటారని అంచనా వేశారు.. మరోవైపు, వైఎస్‌ జగన్‌, నారా చంద్రాబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, సుజనాచౌదరి లాంటి కీలక నేతలు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అంచనా వేశారు ఆరా మస్తాన్‌… ఏపీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేశారు

ఆరా ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 98- 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం
టీడీపీ కూటమి 71 – 81 స్థానాలు

పార్థాదాస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ: 110-120
టీడీపీ-జనసేన-బీజేపీ : 55-65