Site icon NTV Telugu

AP Assembly: ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024లను శాసనసభ ఆమోదించింది.

పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇక‌పై ఎంత‌మంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీ నిబంధ‌న‌లు మారుస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిప‌ల్ శాసనాల స‌వ‌ర‌ణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.

Exit mobile version