ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
Read Also: BAC Meeting: ముగిసిన బీఏసీ సమావేశం.. ఎల్లుండి బడ్జెట్
కాగా.. ఈ సమావేశాల్లో గురువారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ బడ్జెట్‌పై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈనెల 5 న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది. మూడోరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకాలేదు.
Read Also: Hari Hara Veera Mallu: క్రిష్ అవుట్.. డైరెక్షన్ బాధ్యతలు ఎవరి చేతికో తెలుసా?
అంతకుముందు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గర రాజేందర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని.. తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చామన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? అని మండిపడ్డారు. తాము చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం.. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తాము చేసింది తక్కువేనని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
