ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. కాగా.. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. మరోవైపు.. శాసన మండలి కూడా నిరవధిక వాయిదా పడింది. కాగా.. ఈ రెండు సభలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి.
Read Also: Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..
మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు సమావేశాలకు హాజరుకాలేమని చెప్పారు. కేవలం శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీడీపీ, వైసీపీ సభ్యుల ప్రశ్నలు సమాధానాలతో శాసనమండలి 10 రోజుల పాటు దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ టీడీపీ మంత్రుల మధ్యలు మాటలయుద్ధం సాగింది.