AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం

Ap Assembly Session

Ap Assembly Session

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సభ మొత్తం 25 గంటల పాటు కొనసాగిందని శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత వెల్లడించారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ తెలిపారు. అదేవిధంగా మూడు లఘు చర్చలు జరిగాయని చెప్పారు. సభా కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగించినట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

పార్టీల వారీగా సభ్యుల వివరాలు
అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్యను కూడా స్పీకర్‌ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు ఉండగా, జనసేన పార్టీకి 21 మంది, వైసీపీకి 11 మంది, బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగిన సమావేశాల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించడం, మూడు లఘు చర్చలు జరగడం, 103 మంది సభ్యులు ప్రసంగించడం వంటి అంశాలను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభ ముగింపు సందర్భంగా వెల్లడించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.