AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సభ మొత్తం 25 గంటల పాటు కొనసాగిందని శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత వెల్లడించారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు. అదేవిధంగా మూడు లఘు చర్చలు జరిగాయని చెప్పారు. సభా కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగించినట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
పార్టీల వారీగా సభ్యుల వివరాలు
అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్యను కూడా స్పీకర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు ఉండగా, జనసేన పార్టీకి 21 మంది, వైసీపీకి 11 మంది, బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగిన సమావేశాల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించడం, మూడు లఘు చర్చలు జరగడం, 103 మంది సభ్యులు ప్రసంగించడం వంటి అంశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ ముగింపు సందర్భంగా వెల్లడించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- YS Jagan: దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?