NTV Telugu Site icon

Telugu States CS Meeting: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ.. పెండింగ్ అంశాలపై చర్చ!

Ap And Telangana Cs Meeting

Ap And Telangana Cs Meeting

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్‌ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో జరుగుతున్న సమావేశం ఇదే. ఏ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది.

ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, అధికారుల కమిటీ మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. 2024 జూలై 5 తేదీన సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై అధికారులు లోతుగా చర్చించే అవకాశం ఉంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.7,200 వేల కోట్లలో ఇటీవల 2500 కోట్లను కేంద్రం విడుదల చేసింది. మిగతా బకాయిలపై నేడు చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలపై కూడా చర్చించనున్నారు.

ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై కూడా ఈ భక్తిలో ప్రధానంగా చర్చకు రానుంది. అలాగే వృత్తి పన్ను పంపకం అంశం, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగివిపోయిన 8 వేల కోట్ల నిధులు పంపకాల పైనా అధికారుల కమిటీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Show comments