AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి.. అయితే, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఊరటనిస్తూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడానికి ఈ అవకాశం ఉపయోగపడనుంది. అధికారుల ప్రకటన ప్రకారం, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు మరో అవకాశం లభిస్తుంది.
Read Also: Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
Also Read
ఇక, టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. మరోవైపు టెన్త్ ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా అవకాశం కల్పించారు. మే 1 నుంచి మే 7 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాది 6,18,131 మంది టెన్త్ పరీక్షలు రాయగా.. 5,26,9654 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. అంటే 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.. బాలురు 82.68 శాతం పాస్ అయితే.. బాలికలు 87.9 శాతం పాస్ అయ్యి మరోసారి సత్తా చాటారు..
తాజావార్తలు
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?