Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ
- మధ్యప్రాచ్యం యుద్ధంపై సంభాషణ
- ఉక్రెయిన్ యుద్ధంపై కూడా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య 90 నిమిషాల పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు.
ప్రధానంగా ఇరాన్ పరిస్థితులు, పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలపై చర్చ జరిగినట్లుగా చెప్పారు. ఇక ఇరాన్‌పై కాల్పుల విరమణ కొనసాగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ సమర్థించారని.. ఇది శాంతి చర్చలకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే మరొకసారి అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలక దిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పుతిన్ హెచ్చరించారు. ఇది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదని.. యావత్తు ప్రపంచానికే నష్టం కలిగిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఉద్రిక్తతల పరిష్కారానికి రష్యా పూర్తి స్థాయిలో దౌత్య సహకారం అందిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. 2022లో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ప్రస్తుత పరిస్థితులపై ట్రంప్‌కు పుతిన్ వివరించారు. రష్యా సైన్యం వ్యూహాత్మక ఆధిక్యంలో ఉందని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాయకత్వంపై ఇద్దరు నాయకులు విమర్శలు చేసినట్లు సమాచారం. యూరోప్ మద్దతుతో యుద్ధాన్ని పొడిగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మే 9న జరిగే విక్టరీ డే సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని పుతిన్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు ట్రంప్ కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం. విక్టరీ డే ప్రతి సంవత్సరం మే 9న జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మాస్కోలో భారీ పరేడ్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!