Anurag Thakur : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అటల్ బీహారీ వాజపేయి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. అటల్ జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి ప్రజలకు..పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పీవీ నరసింహారావు.. వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. పీవీ నరసింహా రావు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించింది అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. వాజపేయి జైల్లో ఉన్న దేశం కోసమే పని చేశారన్నారు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు అనురాగ్ ఠాగూర్.
Arunish Chawla: కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా నియామకం
అంతేకాకుండా..’అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేద్కర్ గురించి మాట్లాడడం విడ్డూరం.. కార్పొరేటర్ నుండి ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తి వాజపేయి. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్ పేయి వ్యవహరించిన తీరు పై అమెరికా వంటి దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.. భారత దేశ ఒక్క ఇంచు భూమి ఇతర దేశాలు ఆక్రమించుకున్న చూస్తూ ఊరుకోం అని వాజ్ పేయి అన్ని దేశాలకూ సందేశాన్ని పంపారు.. జై జవాన్…జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే నినాదాన్ని వాజ్ పేయి ఇచ్చారు. వాజపేయి ఆశయాలను ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతున్నాం అని తెలిసిన వాజ్ పేయి రాజనీతి తప్పలేదు. వాజపేయి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ.. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారు’ అని అనురాగ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు.
Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’