Site icon NTV Telugu

Anurag University : అనురాగ్ సెట్ 2023 ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

Anurag University 01

Anurag University 01

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో ప్రముఖ యూనివర్సిటీ అయిన అనురాగ్ యూనివర్సిటీ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష తేదీని ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అనురాగ్ సెట్-23 ప్రవేశ పరీక్ష తేదీ ఈనెల చివర్లో  జనవరి 29న నిర్వహిస్తున్నట్లు అనురాగ్ సెట్ నిర్వాహకులు యూనివర్సిటీ సి.ఈ.ఓ నీలిమ పేర్కొన్నారు. అనురాగ్ యూనివర్సిటీలో ఎంసెట్ ద్వారా మరియు అనురాగ్ సెట్ ద్వారా ప్రవేశం ఉన్నట్లు తెలిపారు.గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అనురాగ్ సెట్ కు అనూహ్య స్పందన వస్తుంది, తాము నిర్వహించే అనురాగ్ సెట్ లో మంచి ర్యాంకును వచ్చిన విద్యార్దులకు పీజులో రాయితీ ఇచ్చి యూనివర్సిటీ పలు కోర్సుల్లో చేర్చుకుంటున్నామని సి.ఈ.ఓ నీలిమ పేర్కొన్నారు.

Also Read : Vande Bharath : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక

నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్ -NIRF 2022లో అనురాగ్ కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులను మరోసారి వివరించారు. తమ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ప్లేస్మెంట్ విషయంలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలలో చేరారని వారు అన్నారు. అదే విధంగా దిన దిన అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా తమ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని భోదిస్తున్నారని సిఈఓ, తెలిపారు..అనంతరం అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ సెట్ 2023 పోస్టర్ రిలీజ్ చేశారు.

Exit mobile version