NTV Telugu Site icon

Actress Rupali Ganguly: బీజేపీలో చేరిన ఫేమస్ టీవీ నటి రూపాలీ గంగూలీ

New Project (10)

New Project (10)

Actress Rupali Ganguly: టీవీ నటి రూపాలీ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘అనుపమ’, ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ వంటి సీరియల్స్‌లో పనిచేసిన రూపాలీ బుధవారం (మే 1) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వినోద్ తావ్డే, అనిల్ బలూనీ సమక్షంలో రూపాలీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు రూపాలికి పుష్పగుచ్ఛం అందజేసి కండువా కప్పి బీజేపీలోకి స్వాగతం పలికారు.

బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో రూపాలీ మాట్లాడుతూ.. అభివృద్ధి మహాయజ్ఞం చూసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఈ అభివృద్ధి ‘మహా యాగం’ చూస్తుంటే నేనూ ఇందులో పాలుపంచుకోవాలని అనిపిస్తోందన్నారు. నేను ఏం చేసినా మంచిగా చేయాలంటే మీ ఆశీస్సులు, సపోర్ట్ కావాలని కోరారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆమె బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ కూడా ముగిసింది.

Read Also:Akhilesh Yadav: ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతుంది.. కోవిషీల్డ్ పై అఖిలేష్ ఫైర్..

బుల్లితెరపై అత్యధికంగా సంపాదిస్తున్న నటి రూపాలీ. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అందులో ఆమె అభిమానిగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గురించి మాట్లాడుతూ.. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఆమె మాట్లాడుతూ, “ఈ రోజును నా మనసులో గుర్తుపెట్టుకుంటాను. ఇది నా కల నెరవేరిన రోజు. ప్రధాని మోడీని కలవాలనేది నా కల.” అన్నారు.

రూపాలీ ప్రస్తుతం అనుపమ సీరియల్‌లో పనిచేస్తున్నారు. ఇది భారతీయ టెలివిజన్ సీరియల్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పొందిన షో. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే హాస్య నాటక ప్రదర్శనతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఇది పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కామెడీ షో మొదటిసారి 2004లో ప్రసారం చేయబడింది. కేవలం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత నిలిపివేయబడింది. ఈ కార్యక్రమంలో సుమీత్ రాఘవన్, సతీష్ షా, దేవెన్ భోజనీ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

Read Also:Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు..