Site icon NTV Telugu

Anupama Parameswaran : రెండు నెలల్లో అమ్మడి ఖాతాలో త్రీ హిట్స్

Anupama Parameswaran

Anupama Parameswaran

ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టీ అనుపర పరమేశ్వరన్‌కే. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ కయాద్ లోహార్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్‌లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్- మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్.

Also Read : MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్

కోలీవుడ్, టాలీవుడ్‌పై ఫోకస్ చేయడంతో సొంత ఇండస్ట్రీలో సినిమాలు తగ్గించేసిన అనుపమ.. రీసెంట్లీ చాలా గ్యాప్ తర్వాత జేఎస్కేతో అక్కడి ఫ్యాన్స్ పలకరించింది. కానీ వివాదాల కారణంగా ఆ బొమ్మ ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా తెలియదు. కానీ ద పెట్ డిటెక్టివ్ 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చింది. బైసన్ కన్నా ఒక్క రోజు ముందు రిలీజైన ద పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు 10 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మల్లూవుడ్‌లో ఎన్నాళ్లుగా ఊరిస్తున్న హిట్ దక్కింది.  ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. పరదాతో నమోదు చేసిన ప్లాప్‌ను కిష్కిందపురితో కవర్ చేసేసింది ఈ కర్లీ హెయిర్ గర్ల్. ఇలా రెండు నెలల్లోనే త్రీ హిట్స్ కొట్టి ఊపిరి తీసుకుంది అనుపమ. అలాగే అనుపమకు టాలీవుడ్‌లో మరోసారి టెస్ట్ ఎదుర్కోబోతోంది. తమిళంలో హిట్టైన బైసన్.. తెలుగులో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. మరీ కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.

Exit mobile version