Jharkhand: భారీ ఎన్‌కౌంటర్.. సెంట్రల్ కమిటీ సభ్యుడు సహా 17 మంది మావోయిస్టులు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్‌లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘబురు’ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందారు.
READ MORE: IND vs NZ: ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు.. రెండో టీ20లో 209 రన్స్ ఉఫ్!
Also Read
- Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
- India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
- CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
- Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
209 కోబ్రా బెటాలియన్, చైబాసా జిల్లా పోలీసులు, ఝార్ఖండ్ జాగ్వార్ బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండు రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో రూ.1 కోటి బహుమతి ఉన్న అనల్ దాతో పాటు మరో 14 మంది మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ సమయంలో మరో రెండు మృతదేహాలు లభించడంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. అనల్ దా సీపీఐ (మావోయిస్టు)లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఝార్ఖండ్‌లో అతనిపై 149కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను భద్రతా దళాలు కీలక విజయంగా భావిస్తున్నాయి. ఈ అంశంపై కిరిబురు ఎస్డీపీఓ అజయ్ కర్కెట్టా మాట్లాడుతూ.. “దాదాపు రెండు రోజుల పాటు కొనసాగిన ఎదురుకాల్పులు ఇప్పుడు ముగిశాయి. అయితే పగటి వేళల్లో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తాం” అని తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం కూడా సారండా అటవీ ప్రాంతంలో మరో నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజుకు చేరుకున్న సమయంలో కొన్నిచోట్ల చెదురుమదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
READ MORE: Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో లోకేష్ బర్త్‌డే వేడుకలు.. అఖిలప్రియ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
తాజావార్తలు
-
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
-
India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
-
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!