SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (2/21), కేశవ్ మహరాజ్ (2/22) కూడా చెలెరుగడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 19 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్ (19 నాటౌట్), క్వింటన్ డికాక్ (20) రాణించారు. నోకియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక విలవిల్లాడిపోయింది. నోకియా పేస్‌కు లంక దాసోహమైంది. పరుగులు చేయడానికి లంక బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ మొత్తంలో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు మాత్రమే వచ్చాయంటేనే.. లంక ఎంతగా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. ఔట్ ఫీల్డ్ కూడా మందకొడిగా ఉంది. నాలుగో ఓవర్లో నిశాంక (3)ను బార్ట్‌మ్యాన్ ఔట్ చేయడంతో శ్రీలంక పతనం మొదలైంది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో కమిందు మెండిస్ (11)ను ఔట్ చేసిన నోకియా.. పదో ఓవర్లో కుశాల్ మెండిస్‌ను పెవిలియన్ చేర్చాడు. వరుస బంతుల్లో హసరంగ (0), సమరవిక్రమ (0)ను మహరాజ్ ఔట్ చేసి లంకను దెబ్బతీశాడు. 9 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన లంక 10 ఓవర్లలో 40/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు.
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
Also Read: AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్ అప్డేట్స్..
ఛేదనలో శ్రీలంక కూడా బాగా బౌలింగ్ చేసింది. విజయం సాధించిన దక్షిణాఫ్రికా కూడా కాస్త ఒత్తిడికి గురైంది. పరుగుల కోసం ప్రొటీస్ శ్రమించింది. 13 ఓవర్లు ముగిసే సరికి హెండ్రిక్స్ (4), మార్క్రమ్ (12), డికాక్, స్టబ్స్ (13) వికెట్లు కోల్పోయి కేవలం 58 పరుగులే చేసింది. అయితే క్లాసెన్, మిల్లర్ మరో వికెట్ పడకుండా పని పూర్తి చేశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!