ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. వెనుకాల కూర్చున్న శివాని చనిపోయింది. మృతురాలు శివాని గండిపేట సీబీఐటీ (CBIT)లో ఇంజినీరింగ్ చదువుతుంది. కాగా.. ప్రమాదం చేసిన కారును పోలీసులు కనుగొన్నారు. స్కోడా కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకుడు యెడ్లపాటి శ్రీ కలశ్ (19) గా పోలీసులు గుర్తించారు. దీంతో.. యువకుడు కలశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. యువకుడిపై కేసు నమోదు చేశారు.
Hyderabad: ర్యాష్ డ్రైవింగ్కి మరో యువతి బలి..
- ర్యాష్ డ్రైవింగ్ కి మరో యువతి బలి
- రాయదుర్గం పరిధిలో రోడ్డు ప్రమాదం
- బైక్ ను అతివేగంగా ఢీ కొట్టిన స్కోడా కారు
- బైక్ పై వెళ్తున్న బీటెక్ స్టూడెంట్ శివాని (21) మృతి
- బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు.
Show comments