Site icon NTV Telugu

NKR : డైరెక్టర్ గా మారుతున్న మరో రైటర్.. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్

Srikanthvissa

Srikanthvissa

నందమూరి కళ్యాణ్ రామ్ 2022 లో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్ లు అనుదుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ భారీ అంచనాల మధ్య విడుదలై మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. గత కొద్దీ నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. నెక్ట్స్ ఎవరితో అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈసారి హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ నందమూరి హీరో.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. టైగర్ నాగేశ్వరరావు, డెవిల్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు కథ, పుష్ప సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన శ్రీకాంత్ విస్సా ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు, ఇటీవల ఓ కథను కళ్యాణ్ రామ్‌కు వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఫైనల్ వర్షన్ డైలాగ్స్ కూడా ఫినిష్ చేసి అతి త్వరలో అనూన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారట. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా కళ్యాణ్ రామ్ రెడీ చేస్తున్నాడు. అదే బింబిసార 2’. గతంలో ‘బింబిసార’ సూపర్ హిట్ అయినప్పుడే సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ మూడేళ్ళుగా అలా పక్కన పెట్టేసారు. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. శ్రీకాంత్ విస్సా సినిమా కోసం సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడట కళ్యాణ్ రామ్.

Exit mobile version