Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. ఆమెపై కూడా కేసు..!
- జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..
- జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం..!
- లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Case: సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే జానీకి వ్యతిరేకంగా కొందరు.. మద్దతుగా మరికొందరకు ముందుకు వస్తున్నారు.. అయితే, ఈ కేసులో రోజుకో ట్విస్ట్ మాదిరిగా.. కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.. బాధితురాలిగా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసినందుకు చర్యలకు సిద్ధం అవుతున్నారట పోలీసులు.. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. జానీ మాస్టర్‌ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారు.. ఇప్పటికే ఈ కేసులో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో సమగ్ర దర్యాప్తు జరుపుతోన్న విషయం విదితమే..
Read Also: Rajendranagar: బాలికల అనాథాశ్రమంలో కేర్ టేకర్ దారుణం.. పురుషుల ఎదుట దుస్తులు విప్పించి..
Also Read
కాగా, ఇప్పటికే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.. కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే.. మరోవైపు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడు, అంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే బాధితురాలిని జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారని, 2019లోని బాధితురాలతో జానీ మాస్టర్‌కి పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. 2020వ సంవత్సరంలో జానీ మాస్టర్ బాధితురాలి మీద లైంగిక దాడి చేశాడని.. తొలిసారి జానీ మాస్టర్ బాధితురాలు మీద లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేనని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రకారం నాలుగేళ్లలో బాధితురాలిపై ఎన్నోసార్లు లైంగిక దాడి జరిగింది.. ఈ విషయం బయటికి చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని కూడా జానీ మాస్టర్ బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా ఈ మేరకు బెదిరింపులకు దిగినట్లుగా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు.. ఈ రిమాండ్ రిపోర్టు ప్రకారం చూస్తే జానీ మాస్టర్ కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.. ఇప్పుడు జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేసేందుకు సిద్ధం అయ్యారు పోలీసులు.
తాజావార్తలు
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!