NTV Telugu Site icon

A train accident: ఏపీలో మరో రైలుకు తప్పిన ప్రమాదం.. లోకో పైలట్ అప్రమత్తతో సేఫ్

Train 1

Train 1

A train accident: ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా అందరనీ కలచివేస్తుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. మరో 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంకొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. రాత్రివేళ ప్రమాదం జరగడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్‌లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!

ఒడిషాలోని ఘోర రైలు ప్రమాదం అందరిని కంటతడి పెట్టిస్తోంది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అటు రైల్వే అధికారులు, ట్రైన్ లో ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పినట్లైంది.

Read Also: Gudiwada Amarnath: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 170 మంది తెలుగు వారు ఉన్నారు- మంత్రి గుడివాడ అమర్నాథ్

ఎక్కడైనా రైల్వే గేట్ల వద్ద ట్రైన్ వచ్చే సమయంలో ముందుగానే గేట్ వేస్తారు. కానీ సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్‍‌మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్‌మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు. ఒకవేళ లోకో పైలట్ ట్రైన్ ఆపకపోతే ఎలాంటి ఘోర ప్రమాదం జరిగిఉండునోనని ఆందోళన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు గేట్‌మెన్ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టారు.