Site icon NTV Telugu

India-Pakistan War: మరో తెలుగు జవాన్‌ వీరమరణం..!

Sachin Yadavrao Vananje

Sachin Yadavrao Vananje

India-Pakistan War: భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి.. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం తప్పడంలేదు.. సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోగా.. శత్రుదేశంతో పోరాడుతూ కొందరు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌ మురళీనాయక్‌ వీరమరణం పొందగా.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది.. మరోవైపు.. ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్‌ యాదవ్‌ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్… సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.. అయితే, ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహాన్ని తరలించేందుకు ఇండియన్‌ ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది..

Read Also: Vennela Kishore : బ్రహ్మానందం వారసుడు అన్నది ఒప్పుకోను!

Exit mobile version