Site icon NTV Telugu

Vadhandhi: విక్రమ్ వేద మేకర్స్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్…

Vadhanti

Vadhanti

పుష్కర్ అండ్ గాయత్రి ఈ పేర్లు వినగానే సినీ అభిమానులకి ‘విక్రమ్ వేద’ సినిమా గుర్తొస్తుంది. బేతాళ కథలకి మోడరన్ టచ్ ఇచ్చి ‘విక్రమ్ వేద’ సినిమాతో హిట్ కొట్టిన ఈ టీం, ఇటివలే ‘సుడల్’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ కథకి, డివోషనల్ పాయింట్ ని కలుపుతూ ‘సుడల్’ సిరీస్ ని పుష్కర్ గాయత్రి రాసిన విధానానికి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. తాజాగా పుష్కర్ అండ్ గాయత్రి నుంచి ఇంటరెస్టింగ్ సిరీస్ రాబోతోంది. ‘వధంది:ది ఫాబేల్ ఆఫ్ వేలోని’ అనే పేరుతో అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కానున్న ఈ సిరీస్ లో ఎస్.జే. సూర్య పోలిస్ పాత్రలో కనిపించనున్నాడు.

ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సిరీస్ లో సూర్యతో పాటు ‘లైలా’ కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న వధంది ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక ఫారెస్టు ప్రాంతంలో ‘వేలోని’ అనే అమ్మాయి హత్య జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా అమ్మాయిని ఎవరు చంపారు అనే ఎంక్వయిరీ చేయడం మొదలు పెడతాడు. ఆ యువతి తెలిసినవారితో ఆ ప్రాంతానికి వచ్చిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వచ్చి చంపారా? అసలు ఆ అమ్మాయిని ఎవరు ఎందుకు చంపారు? అనేదే కథ. మరి కథనంలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అనేది చూడాలి.

Exit mobile version