ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్‌జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయ్యాలయ్యాయి. గాయపడిన ఇద్దరు సైనికులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read Also: TECNO Phantom V Flip 5G: క్రేజీ డీల్.. రూ. 72 వేల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రూ. 26 వేలకే
ఎన్‌కౌంటర్ స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఒక ఏకే 47, ఒక SLR, ఇస్తాఫ్ రిఫైల్, 303 BPL లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. అదనపు బలగాలతో ఆ ప్రాంతమంతా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా.. ఈ విషయాన్ని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ పీ ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు చనిపోయి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ఏకే 47లు దొరకడంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు