NTV Telugu Site icon

Manipur Shocker: మణిపూర్‌లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్

Manipur

Manipur

Manipur Shocker: ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దానిని మరువక ముందే ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్‌ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Also Read: Mamata Banerjee: బెంగాల్‌కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్‌కు ఎందుకు పంపలేదు?

మణిపూర్‌లో శుక్రవారం మే 4 న చిత్రించిన వీడియోలో మహిళలను నగ్నంగా ఊరేగించి, పురుషుల గుంపు పట్టుకున్నట్లు చూపడంతో కొత్త ఉద్రిక్తత నెలకొంది. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్ ఈ నెల 19న సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత నలుగురిని అరెస్టు చేశారు. హింసాకాండకు వ్యతిరేకంగా గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా పార్లమెంట్‌ ఉభయ సభలను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ వైరల్‌ కావడం మణిపూర్‌లో మరింతగా ఉద్రిక్తతలను రాజేస్తోంది.

Also Read: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!

మణిపూర్ ఇంఫాల్ లోయలో ఉన్న మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కొండలలో ఉన్న గిరిజన కుకీల మధ్య మే నుండి జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. మణిపూర్ లో చెలరేగుతున్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 160 మంది చనిపోయారు. ఇళ్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులైన వేలాది మంది ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

 

Show comments