Site icon NTV Telugu

Sriram case : డ్రగ్స్ కేసులో మరో హీరో..

Drugs Case

Drugs Case

తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. అన్నాడీఎంకే మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు విచారణలో తమిళ నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రసాద్ చెప్పడంతో కోలీవుడ్ లో అలజడి రేగింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నుంగంబాకం జైల్లో ఉన్నారు. శ్రీరామ్ ను  విచిరించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు.

Also Read : Akhil : లెనిన్ నుండి ‘శ్రీలీల’ను లేపేసిన మేకర్స్..?

శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు కృష్ణను పోలీసులు విచారణకు రావాల్సిందిగా కోరారు. తొలిత విచారణకు వచ్చిన నటుడు కృష్ణ ఆ తర్వాత తనను అరెస్ట్ చేస్తారేమో అని పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యాడు. ప్రస్తుతం నటుడు కృష్ణ కోసం ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కృష్ణకు తమిళ సినీరంగంలో పలువురు యువ దర్శకులతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతోను కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలుసుకున్నారు. ఇటు టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం పోలీసులు విచారణలో బయటపడింది. కృష్ణకు ఎవెరెవరితో సంబంధాలు ఉన్నాయో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసారో వంటి విషయాలను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ముందు ముందు ఎవెరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కొలువుడ్ లో చర్చ జరుగుతుంది.

Exit mobile version