NTV Telugu Site icon

Pre Launch: హైదరాబాద్ లో మరో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ

Pre Launch

Pre Launch

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ మోసాలకు పాల్పడుతున్నాయి. వంద శాతం వసూలు పేరిట రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా నగరంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగు చూసింది. జీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ రూ.120 కోట్ల పైగా మోసానికి పాల్పడింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీగా వసూల్లు చేసిన..జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఛైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు.

READ MORE: UP BJP: యూపీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.. ఓటమికి 6 కారణాలు చెప్పిన పార్టీ..

మరో ఇద్దరు డైరెక్టర్లు పరారులో ఉన్నారు. వీరంతా కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. విల్లాల పేరుతో భారీగా డబ్బులు కలెక్షన్ చేసి మొహం చాటేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, సీసీఎస్లో జీఎస్ఆర్పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ తో పాటు శివార్ ప్రాంతంలో ఫ్లాట్లు వెళ్లాలా ఫ్రీ లాంచ్ ఆఫర్ల మోసానికి పాల్పడ్డారు. భూమి లేకపోయినా ఉన్నట్టు చూయించి వసూళ్లు చేశాడు సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు. ఇతరుల భూమిని తమ భూమిగా చూపెట్టి ఆఫర్లు పెట్టాడు. నమ్మిన జనం మోసపోయారు.