Site icon NTV Telugu

YSRCP Central Office: వైసీపీ కేంద్ర కార్యాలయ సమీపంలో నిప్పు పెట్టిన దుండగులు..!

Ysrcp Central Office

Ysrcp Central Office

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలు వైసీపీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తాజాగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

READ MORE: X Outage: “ఎక్స్” సేవల్లో అంతరాయం..

కాగా… వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఫిబ్రవరి 5వ తేదీన మొదటి అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాయి కార్యాలయ వర్గాలు.. ఇదే ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అందజేయాలని 7వ తేదీన ఓ నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఈ క్రమంలో ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయక పోవటంతో సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు లేఖ ఇచ్చాయి వైసీపీ కార్యాలయ వర్గాలు.. ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయానికి మరో నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఇప్పటికే వైసీపీ కార్యాలయ దగ్గర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు..

READ MORE: Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు

Exit mobile version