Site icon NTV Telugu

New Film: కోర్టు మూవీ జంట కొత్త సినిమా..? టైటిల్ ఫిక్స్..?

Court

Court

New Film: క‌థానాయ‌కుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా కోర్ట్‌. తెలుగు దర్శకులు అరుదుగా స్పృశించే కోర్ట్ రూమ్ డ్రామా క‌థ‌తో ఈ చిత్రం రూపొందించగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాలో నటించిన హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ కొత్త సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. “బ్యాండ్ మేళం” అని టైటిల్ ను ఎంపిక చేశారు.

READ MORE: Tamannaah : విరాట్ కోహ్లీతో పెళ్లి చేశారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్

కాగా.. కోర్ట్ సినిమాలో ‘జాబిలి’ క్యారక్టర్ లో నటించి మెప్పించిన అమ్మాయి అసలు పేరు శ్రీదేవి ఆపల్ల. సినిమాలో క్యారక్టర్ పేరుకు తగ్గట్లే శ్రీదేవి.. అందాల జాబిలి. మూవీలో ఈ బ్యూటీడాల్ అలరించింది. శ్రీదేవి స్వస్థలం కాకినాడ. ఈ ఆంధ్ర అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ తో పేరు సంపాదించుకుంది. 2021లో ఇన్ స్టాగ్రామ్ లో జాయిన్ అయిన శ్రీదేవి ఫొటోలు, రీల్స్ తో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్ తోనే శ్రీదేవికి కోర్ట్ సినిమాలో ఆఫర్ వచ్చింది.

READ MORE: Sundar Pichai: కామెంటరీ బాక్స్‌లో సందడి చేసిన టెక్ దిగ్గజం! వీడియో వైరల్..

ఇక హీరో విషయానికి వస్తే.. కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం మెరిశాడు హీరో రోషన్.. ‘కోర్ట్‌’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్‌ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు రోషన్. ‘కోర్ట్‌’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్‌ హిట్‌ కొట్టాడు. రోషన్ స్వగ్రామం కూనవరం.

Exit mobile version