Poacher Trailer : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం మంచి క్రేజ్ వుంది.వాటిలో క్రైమ్ సిరీస్ లకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే.ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు.బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గురువారం (ఫిబ్రవరి 15) ఈ ట్రైలర్ ను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.”ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి” అనే క్యాప్షన్ తో ఆలియా సిరీస్ ఈ ట్రైలర్ ను షేర్ చేసింది. కేరళ అడవుల్లో ఓ ఏనుగును ఓ ముఠా మట్టుబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలువుతుంది.
1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అయిందంటూ ఈ రాకెట్ ను ఇన్వెస్టిగేట్ చేసే టీమ్ మాట్లాడుకుంటూ ఉంటుంది.అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.. దీని విలువ ఏకంగా రూ.కోటి కోట్లని ట్రైలర్ చివర్లో చెప్పడం సమస్య తీవ్రత ఏంటో మేకర్స్ తెలియజేశారు.పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు.ఈ పోచర్ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆలియా.. దీనిని బాగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యే తాను అడవిలో ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ అడవిలో ఏనుగులను చంపుతున్న తీరుపై ఆ వీడియోలో ఆలియా మాట్లాడింది. అక్కడ కనిపించిన ఓ రైఫిల్, బుల్లెట్ కేసింగ్స్ మరియు ఓ ఏనుగు కళేబరం ఆలియాను భయపెడతాయి.ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నంలో భాగంగా తాను ఒక రోజు ఆ అడవిలో గడిపానని, కానీ ఆ సమయంలోనే అక్కడి దారుణాలు చూసి తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె చెప్పడం విశేషం.. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పోచర్ సిరీస్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు…
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!