చైనా ఎప్పుడూ తన పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట సహాయం పేరుతో అప్పు ఇచ్చి, ఆ తర్వాత తన బలగాలను వారి ప్రాంతంలో మోహరించడం ప్రారంభిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ తర్వాత ఇప్పుడు చైనా.. తజికిస్థాన్‌ను బలిపశువుగా మార్చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) పేరుతో చైనా తజికిస్థాన్‌కు భారీ రుణం ఇచ్చింది. భద్రతా ఒప్పందంపై సంతకం అనంతరం డ్రాగన్ తజికిస్తాన్‌లో రహస్య స్థావరాన్ని నిర్మిస్తుందనే వాదనలు వినిపించాయి. ఇది భారతదేశానికి పెద్ద ముప్పు ఎందుకంటే ఈ రహస్య స్థావరం పీవోకే(POK) కి చాలా దగ్గరగా ఉంది.
READ MORE: Automobile Sector Budget 2024: ఆటో పరిశ్రమకు బడ్జెట్ ఎలా ఉంది.. EVలు చౌకగా మారే అవకాశం ఉందా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ బీఆర్‌ఐ పేరుతో తజికిస్థాన్‌కు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమని పదే పదే ఒత్తిడి తెస్తుంది. ప్రస్తుతం.. తజికిస్థాన్ డబ్బును తిరిగి చెల్లించలేకపోతుంది. దీంతో చైనా తజికిస్థాన్‌లోని తూర్పు గోర్నో బదక్షన్ ప్రాంతంలో సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని 2019లో వెల్లడైంది. అయితే.. చైనా లేదా తజికిస్థాన్ దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. చైనా ఇక్కడ పూర్తి రహస్య స్థావరాన్ని నిర్మించుకున్నట్లు ఇటీవల కొన్ని ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. అయితే ఆ నివేదికను చైనా తోసిపుచ్చింది.
READ MORE: Om birla: లోక్‌సభ స్పీకర్ కుమార్తె జాబ్‌పై విమర్శలు.. హైకోర్టులో పరువు నష్టం దావా
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2023 అక్టోబర్‌లో పొరుగు దేశాలను హెచ్చరించారు. చైనా హిడెన్ ఎజెండా గురించి చెబుతూ.. ప్రమాదానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు డ్రాగన్ వలలో ఎలా చిక్కుకుపోయాయో చెప్పారు. మాల్దీవులు కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పుడు తజికిస్తాన్ బలిపశువుగా మారుతోంది. అక్టోబరు 2021లో, తజికిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బదక్షన్ ప్రాంతంలో మరో చైనా స్థావరాన్ని నిర్మించేందుకు అక్కడి పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు కొత్త రహస్య స్థావరం వెలుగులోకి వచ్చింది. తజకిస్థాన్‌ను మోసం చేసి చైనా ఈ భూమిని లాక్కుందని అంటున్నారు.